బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు భారీగా తరలి రండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
వరంగల్ లో ఈ నెల 27 వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో 'చలో వరంగల్ పోస్టర్' ను ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ...చలో వరంగల్ బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు ప్రజలు, గులాబీ సైన్యం భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శరణ్ గిరి, యాదగిరి గౌడ్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, అఫ్జల్,అరుణ్, శోభన్ బాబు,లోకేష్, సతీష్, జామా, సాజిద్, జావిద్, మహేష్, రేణుక, శ్వేత, సాయి లత ,అర్చన తదితరులు పాల్గొన్నారు.
Tags:
Comment List