వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

లోకల్ గైడ్:

1. దూసుకుపోయేవారు
ఆకాశంలో పక్షిలా ఎగిరిపోతారు
ఊగిసలాడేవారు 
ఊయలలా ఉన్నచోటే ఆగిపోతారు 

2.అధినేత తలుచుకుంటే 
అందలాలకు కరువు లేదు 
అనతి కాలంలోనే కర్ణుడు 
అంగరాజై మెరవలేదా 

3. ఆకూ వక్కా నమిలితేనే 
నోరు పండేను
చుక్కా చుక్కా చేరితేనే 
చెరువు నిండేను

4. హక్కుల ఆస్వాదనకై
 పరిగెత్తితే సరిపోతుందా 
బాధ్యతల బరువు సైతం 
మోయాలి కదా 

5.బంధానికి బలం 
ఆత్మీయ పలకరింపు 
చిరునవ్వు తోడైతే 
మనసు పులకరించు 

6.సంసారం 
సమస్యల హారం 
సంతానం 
సంపాదనల భాగాహారం 

7.చలి చెలరేగితే 
ఎవరికైనా కంపనం 
ఆదిత్యుడే ఆలస్యంగా 
ఇస్తాడుగా దర్శనం 

8.పరదాలు లేని సరదాల 
స్వర్గతుల్యం బాల్యం 
మరువలేని విలువైన 
మధురస్మృతులు అమూల్యం

9.మెతుకులే కదా 
బతుకుకు ఆధారం 
అటుకులే కదా 
ఆదిమిత్రుల ఫలహారం

వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News