స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాల ఆవిష్కరణ. 

శాసన మండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి. 

స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాల ఆవిష్కరణ. 

నల్లగొండ జిల్లా బ్యూరో.

లోకల్ గైడ్:

మునుగోడు మండలం పలివేల గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి , కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాలను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పలివేల జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే  గురునాథ్ రెడ్డి ల జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ "  తన కోసం కాకుండా పరుల కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తాం అనే దానికి స్వర్గీయ నేతలు గురునాథ్ రెడ్డి , బచ్చిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లు నిదర్శనం అని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటము చేసి ,యావత్ తెలంగాణ ప్రజలకు పోరు బాట  వారు చూపారని వివరించారు. గురునాథ్ రెడ్డి  ఆనాటి చిన్న కొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి , ప్రజలకు ఎంతో సేవ చేసారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో సర్కారు ఉన్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం , మాజీ  ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహా రెడ్డి , పల్లా వెంకట్ రెడ్డి , మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News