ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- ప్రగతిశీల యువజన సంగం జిల్లా అధ్యక్షులు. బీరెల్లి దానయ్య.
గద్వాల (లోకల్ గైడ్) : ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దానయ్య మాట్లాడుతూ..ఒక్కొక్క విద్యార్థి నుంచి రిజిస్ట్రేషన్ పేరు మీద 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. బస్ ఫీజు ఒక్క విద్యార్థికి 3 కిలోమీటర్ల దూరానికి 10 వేల నుంచి 12 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో 2025 -2026 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు స్కూల్ ఫీజులను వసూలు చేస్తున్నారని ఇలాంటి ఢిల్లీ వరల్డ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, అంటూ వేలకువేల రూపాయలు నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జమ్మిచెడు కార్తిక్, కోళ్ల అంజి, రామకృష్ణ, పౌల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
Comment List