ప్రజావాణి శేరిలింగంపల్లి జోన్ 

ప్రజావాణి శేరిలింగంపల్లి జోన్ 

 లోకల్ గైడ్ శేరిలింగంపల్లి: శేర్లింగంపల్లి జోన్వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు షేర్లింగంపల్లి ,చందానగర్ ,యూసుఫ్ గూడా ,పటాన్చెరువు సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా మొత్తం 27 వినతులు అధికారులకు అందాయి .ఇందులో జోనల్ కార్యాలయంలో 8, శేర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 11, యూసఫ్ గూడ సర్కిల్ కార్యాలయంలో 5 ,చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 3 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News