రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం
By Ram Reddy
On

లోకల్ గైడ్:
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్‌ఖాన్(36) రాణించడంతో టైటాన్స్ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. తుషార్ (2/53), తీక్షణ (2/54) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ 159 స్కోరుకు పరిమితమైంది. హెట్‌మైర్(32 బంతుల్లో 52, 4ఫోర్లు, 3సిక్స్‌లు), శాంసన్(41) రాణించినా లాభం లేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ (3/24), సాయి కిషోర్(2/20).. రాయల్స్‌ను దెబ్బతీశారు.
Tags:
Comment List